Header Header

గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతున్నందున వేసవి మరింత తీవ్రంగా ఉండబోతుంది. వేసవి తీవ్రత ఎంత ఉన్న సరే, ఇప్పటినుండి శరీర ఉష్ణాన్ని అదుపులో ఉంచుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. ముఖ్యంగా, పిల్లలు ఎవరైతే వేసవి శెలవల కోసం ఎదురు చూస్తూ మధ్యాహ్న వేళలో విరామం లేకుండా ఆటలు ఆడుతూ ఉంటారో అలాంటి వారిని అనునయించి మధ్యాహ్నం నిద్ర పోయేలా చెయ్యాలి.

ముఖ్యంగా వేసవి లో అధిక స్వేదం వలన మన శరీరం లోని నీటి శాతం త్వరగా కోల్పోతాము. నీరు దాహం తీర్చే ముఖ్యమైన వనరు అయినప్పటికీ, వేడి గాలులు, భరించలేని వేడి, అంతులేని మధ్యాహ్నాలను చల్లని ఇంకా ఆహ్లాదకర పానీయాలతో ఆనందించవచ్చును.

అదృష్టవశాత్తు వేసవి అప్పుడు దక్షిణ భారతదేశం లో అద్భుతమైన ఆహరం లభిస్తుంది. అవి వేసవి లో సహజమైన నివారణలు ఉపయోగపడతాయి. ఎండను ఆరోగ్యకరంగా ఎదుర్కొనేందుకు - అమ్మమ్మలు, అమ్మలు అనాదిగా పరీక్షించి చూసిన అనేక సమ్మర్ డ్రింక్స్ లో అత్యుత్తమమైనవి మీ కోసం. ఇంట్లో తయారు చేసుకునే సులభమైన ఆహ్లాదకరమైన పానీయములు కొన్ని కాగా మీరు ప్రయాణిస్తుంటే కూడా పనికొచ్చేవి కొన్ని.

కొబ్బరి నీరు: ముఖం పైన చక్కని చిరునవ్వుని తీసుకునిరావటానికి లేత కొబ్బరి నీరుని మించినది లేదు. కొబ్బరి నీటిలోని యాంటిఆక్సిడెంట్స్, ఔషధ గుణములు వేసవిలో శరీర ఉష్ణాన్ని అదుపులో ఉంచుకోవటానికి చక్కని మూలం. సాదా లేక సుగంధ పదార్ధాలతో లేక కాలానుగుణ పండ్లతో కలిపి తీసుకోవటం అనేది ఎప్పటికి మంచిది.​


చెరుకు రసం: ప్రజలు వేల సంవత్సరాల నుంచి అనేక సమస్యలను పరిష్కరించటానికి చెరుకు రసాన్ని సహజ పరిహారంలాగా ఉపయోగిస్తున్నారు. ఖనిజాలు,పోషకాల యొక్క గొప్ప మూలం అయిన చెరుకు రోగ నిరోధకశక్తిని పెంపొందించటానికి ఉపయోగపడుతుంది. నిమ్మకాయలు,అల్లం చెరుకు రసంలో కలిపితే మంచి రుచి లభిస్తుంది,ఈ వేసవి లో చల్లగా ఉండటానికి ఉపయోగపడుతుంది.


పుచ్చకాయ రసం: వేసవి కాలానికి పుచ్చకాయలు పర్యాయపదములు. మీరు గుజ్జు ఉండే జ్యూస్ ల కోసం చూస్తున్నా లేకున్నా తక్షణం తాజాగా అయ్యేందుకు, దాహం తీరేందుకు మీరు దీనిని నమ్మవచ్చు.


నిమ్మ రసం: ఈ వేసవి లో అత్యంత మధురమైన పానీయాన్ని తీసుకోవటం మరిచిపోవద్దు. శరీర ఉష్ణాన్ని పరిపూర్ణంగా అదుపులో పెట్టుకోవటానికి చల్లటి నీరు లేదా ఐస్ లో కొంచెం పంచదార,నిమ్మకాయ,చిటికెడు ఉప్పువేసి చక్కని నిమ్మరసాన్ని తయారుచేసుకోవచ్చు.


జల్జీరా: వేయించిన జీలకర్ర పొడి,నీరు,నల్లఉప్పు తో తయారు చేస్తారు;జల్ జీరా ముఖ్యంగా వేసవిలో జీర్ణ సమస్యల వల్ల బాధపడేవారికి చక్కని పరిష్కారం.


కంజి: భారతీయ ప్రోబైయటిక్ గా పిలవబడే కాంజి నీరు, నల్ల క్యారెట్,బీట్రూట్,ఆవాలు,ఇంగువ తో చేసినటువంటి పానీయం. అది ఉపయోగించటానికి కొంత సమయం పట్టినప్పటికీ మీరు వేసవి లో ఆరోగ్యకరంగా ఉండటానికి దీనిని పరిగణించవచ్చు.


జిగర్తాండ: జిగర్తాండ దక్షిణ భారతదేశంలోని మధురై వీధులలో అమ్మబడే ఒక మధురమైన పానీయం. ఐస్ క్రీం, కండెన్స్డ్ పాలు, ఫలూద తో చేయబడిన ఈ పానీయం ఖచ్చితంగా స్థానికుల అభిమానాన్ని పొందింది.


నన్నారి షర్బత్: నన్నారి వేళ్లతో చేయబడే నన్నారి షర్బత్ అనేక కేరళ కుటుంబాలలో ప్రధానమైనది. చక్కర వేర్లను,నీటిని, కొంచెం సున్నాన్నిబాగా మరిగించటం ద్వారా ఈ పానీయము తయారవుతుంది, కేరళలో నఱునీండి షర్బత్ అని కూడా పిలవబడే ఈ పానీయం పిండి చేయబడిన ఐస్ తో ఇవ్వటం వలన వేసవిలోని వేడిని తట్టుకోవటం లో చాలా ఉపయోగపడుతుంది.


మజ్జిగ: ఆరోగ్యకరమైన ఇతర కార్బోనేటేడ్ పానీయాలకంటే పెరుగు తో చేయబడిన ఈ మజ్జిగ నిస్సందేహం గా భారతీయులకు ఇష్టమైన పానీయం. అద్భుతమైన జీర్ణప్రక్రియకు, అణచిపెట్టుకున్న మీ దాహానికి సహజసిద్ధమైన జెర్సీ మజ్జిగ ఇప్పుడు జీరా, స్పైసి(అల్లం,మిరప) రుచులలో లభ్యం అవుతుంది. మీరు ప్రయాణం చేసేటప్పుడు ఇది ఒకటి మీతో ఉంచుకోండి. తరువాత అవి దొరుకుతాయో లేదో అనుకుంటే ముందే వాటిని నిల్వ చేసుకోవడం మంచిది.

అన్వేషించండి


రాగి మజ్జిగ: మజ్జిగను రాగిపిండి, చిటికెడు ఉప్పుకలిపితే ఆరోగ్యకరమైన పోషకాహారం అలాగే ఆహ్లాదకరమైన వేసవి పానీయం పొందుతారు. జెర్సీ జీరా, స్పైసి (అల్లం, మిరప) రుచులతో ప్రయత్నించండి

అన్వేషించండి


లస్సి: వేసవిలో లభించే సహజసిద్ధమైన లస్సిని మించినది ఏది లేదు. తీపి, మామిడి రుచులలో లభిస్తుంది..నేడే జెర్సీ లస్సిని ప్రయత్నించండి.

అన్వేషించండి


ఫ్లేవర్డ్ పాలు: మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు చల్లని ఫ్లేవర్డ్ పాలను మించినది ఏది ఉండదు. మీరు కేసర్, బాదం మరియు ఖర్జూర రుచులలో ఫ్లేవర్డ్ పాలను ఎప్పుడైనా ప్రయత్నించారా?

అన్వేషించండి


థిక్ షేక్: 100% స్వచ్ఛమైన పాలతో చేసే ఈ థిక్ షేక్ ఈ వేసవికి మీకు ఇష్టమైన పానీయం కాబోతున్నది. స్నాక్స్ సమయాన్ని పరిపూర్ణం చెయ్యటానికి మీ సాధారణ స్నాక్స్ లో కలపండి.

అన్వేషించండి

 

సిఫార్సు బ్లాగులు

ఆహారంలో చేర్చడం వలన కలిగే ప్రయోజనాలుా....
పెరుగు ఎందుకు లాభదాయకమైనదో తెలుసుకోండి...
జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి