Header Header

కావల్సిన పదార్థాలు

ఆరుగురుకు సరిపడిన పదార్ధాల కొలతలుపొడి పదార్ధాలు:

  • 120 గ్రా: రిఫైన్డ్ ఫ్లోర్
  • 5 టేబుల్ స్పూన్స్ పొడిచేసిన  పంచదార
  • ½ టేబుల్ స్పూన్స్ బేకింగ్ పౌడర్
  • ¼ టేబుల్ స్పూన్స్ బేకింగ్ షోడా​

తడి పదార్ధాలు:

  • 200 మీలీ కండెన్సెడ్ పాలు (½ డబ్బా)
  • ½ టేబుల్ స్పూన్స్ వెనిల్లా ఎసెన్స్
  • 1 టేబుల్ స్పూన్స్ నూనె లేక గ్లిసరిన్
  • 50 మీలీ  పాలు
  • 50 గ్రా వెన్న (మామూలు ఉప్పు కలిగినది)
  • 1 కప్ పైనాపిల్ ముక్కలు
  • 2 కప్పుల నీరుr
  • ½ కప్ పంచదార
  • ఫ్రాస్టింగ్:
  • 2 కప్పుల డబుల్ విఫ్డ్ క్రీం

తయారు చేసే విధానం

స్పాంజ్ కేక్ తయారు చేయటానికి:

  • 200 డిగ్రీల వద్ద మైక్రోవేవ్ కన్వెక్షన్ ను ముందుగా వేడి చేసుకొండి
  • ఫ్లోరుని, బేకింగ్ పౌడర్ ని మరియి బేకింగ్ సోడాని జల్లెడ పట్టాలి.
  • బేకింగ్ ట్రే కి వెన్న రాయాలి.
  • పొడి పిండిని దానిలో చల్లి దులిపేయాలి.
  • పెద్ద బౌల్ లో ఎలక్ట్రిక్ బీటర్ తో వెన్నను మృదువుగా చేయాలి.
  • పొడిచేసిన పంచదారని బాగా కలపాలి.
  • కండెన్స్డ్ మిల్క్ కలిపి 7 లేక 8 నిమిషాలు బాగా గిల కొట్టాలి.
  • మామూలు పాలు కలిపి వేగంగా గిల కొట్టాలి.
  • గ్లిసరిన్ లేదా ఆయిల్ మరియు వెనిల్లా ఎసెన్స్ కలపాలి.
  • 5 నిమిషాల పాటు అదనంగా గిల కొట్టాలి.
  • 80 డిగ్రీల వేడిలో 40 నిమిషాలు బేక్ చెయ్యాలి.


పైనాపిల్ జ్యూస్ చేయటానికి:

  • పైనాపిల్ ను సన్నని స్లైసెస్ గా చెయ్యాలి.
  • కేక్ రుచి చెడిపోకుండా పండులో ఉండే ఆమ్ల గుణం పోయేదాకా ½ కప్ పంచదార మరియూ 2 కప్ ల నీరు పోసి 10 నుంచి 15 నిమిషాల సేపు ప్రెషర్ కుక్కర్ లో బాయిల్ చేయండి.
  • జ్యూస్ ని వడగొట్టి పక్కకు పెట్టుకోవాలి.
  • పండు లోని పిప్పిని విఫ్డ్ క్రీంను కలిపి బీట్ చేసి పక్కన ఉంచండి.

బేక్ చేసిన కేక్ ని ఒక దగ్గరిగా పెట్టాలి:

  • కేక్ ను 2 భాగాలుగా చేయండి.
  • 2 భాగాలను విడివిడిగా పైనాపిల్ జ్యూస్ లో నాన పెట్టాలి.
  • ట్రేలో కింద భాగంలో ఒక స్లైస్ ను పెట్టి దానిపై విఫ్డ్ క్రీంని కలిపిన పండుపిప్పిని ఉంచి దానిపై మరో స్లైస్ పెట్టాలి.
  • పై నుంచి అదనంగా జ్యూస్ ను పోయాలి.
  • స్పాట్యులా సహాయంతో మొత్తం విఫ్డ్ క్రీం ని కేక్ పై పరచండి.
  • కేక్ ను రిఫ్రిజిరేటర్ లో 30 నిమిషాలపాటు ఉంచాలి.
  • బయటకు తీసి విఫ్డ్ క్రీం రెండవ కోట్ గా వేయాలి.
  • పైపింగ్ బ్యాగ్ సహాయంతో పువ్వుల అలంకరణ చేసి వాటిపై చెర్రీలు పెట్టాలి.
  • ఇంకొక గంట సేపు చల్ల పరచి సర్వ్ చెయ్యాలి.
జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి