Header Header

కావల్సిన పదార్థాలు

  • 250 గ్రాములు లేదా 8 నుంచి 9 ఔన్స్‌ల జెర్సీ పన్నీర్/కాటేజ్ చీజ్.
  • 250 గ్రాములు లేదా 8 నుంచి 9 ఔన్సుల స్పినాచ్/పాలక్.
  • స్పినాచ్‌ని ఉడకబెట్టడం కొరకు 2 కప్పుల మరిగించిన వేడి నీరు.
  • కాస్తంత పసుపు పొడి.
  • 1 మాదిరి ఉల్లిపాయ లేదాr ⅓ కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు.
  • 2 చిన్న బిర్యానీ ఆకులు.
  • ½ టీ స్పూన్‌ల ఆవాలు.
  • 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్.
  • 2 పచ్చి మిరపకాయలు తరిగినవి.
  • ½ టీ స్పూన్ మిరియాలు.
  • ½ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్.
  • 1 టీ స్పూన్ కసూరీ మేథీ.
  • ¼ కప్పు కొవ్వు తక్కువగా ఉండే క్రీమ్.
  • కాస్తంత చక్కెర.
  • రుచికి ఉప్పు.
  • అవసరమైన మేరకు నూనె.

తయారు చేసే విధానం

పదార్థాల కొలత 2 వ్యక్తులకు సర్వ్ చేయడానికి సరిపోతుంది.

  • దశ1- స్పినాచ్ ప్యూరీని తయారు చేయడం.
  • స్పినాచ్ ఆకుల్ని నీటిలో కడగండి. ఆకులు వేయడానికి ముందు నీటిని వేడి చేయాలి. స్పినాచ్‌ని 3 నిమిషాలపాటు నీటిలో ఉంచాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. 3 నిమిషాల తరువాత, దానిని బయటకు తీసి, చల్లని నీటిలో ఒక్కనిమిషం ఉంచాలి. మిక్సర్ గ్రైండర్‌లో వేసి, చక్కటి ప్యూరీగా తయారు అయ్యేంత వరకు గ్రైండ్ చేయండి. అదనంగా నీరు కలపాల్సిన అవసరం లేదు.
  • దశ 2- పన్నీర్‌ని ఫ్రై చేయాలి. (ఇది ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు).
  • ఒక పాన్‌లో కాస్తంత నూనె వేడి చేసి, దానిలో పన్నీర్ ముక్కలు వేయాలి. పన్నీరు బంగారు వర్ణంలోనికి మారేంత వరకు ఫ్రై చేయండి. పన్నీర్‌ని ఎక్కువ సేపు ఫ్రై చేయవద్దు,దీని వల్ల పన్నీరు గట్టిగా మారవచ్చు.
  • దశ 3- గ్రేవీ తయారు చేయడం.
  • ఇప్పుడు, పాన్‌లో వేడి చేయబడ్డ ఆయిల్‌కు ఆవాలు మరియు బిర్యానీ ఆకుని కలపండి. గింజలు చిటపటలాడేంత వరకు కలపండి. ఆవాలు మరియు బిర్యానీ ఆకుకు బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలను కలపాలి, బంగారు వర్ణంలోనికి మారేంత వరకు ఫ్రై చేయండి. పాన్‌లోని మిక్స్‌కు అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన మిర్చి కూడా కలపండి. ఇప్పుడు మిగిలిన మసాలా పౌడర్‌లను అంటే పసుపు, మిరియాలు, కసూరీ మేథీ వంటి మసాలా పౌడిని కూడా కలపండి. పాన్ మిక్స్‌కు స్పినాచ్ ప్యూరీని జోడించండి. దీనికి ఉప్పు మరియు కాస్తంత చక్కెర జోడించండి. బాగా కలిపి, గ్రేవీ చిక్కబడేంత వరకు సిమ్‌లో ఉంచండి. 5 నుంచి 6 నిమిషాలు సిమ్‌లో ఉంచండి స్పినాచ్ బాగా ఉడికినట్లుగా ధృవీకరించుకోండి. స్పినాచ్ ప్యూరీలో క్రీమ్‌తోపాటుగా గరం మసాలా పొడిని కలపండి.
  • తుది దశ
  • గ్రేవీ బాగా చిక్కబడినట్లుగా అనిపిస్తే, అన్ని బాగా ఉడికినట్లుగా భావించాలి, ఫ్ర్రై చేసి పన్నీర్‌ని గ్రేవికి కలపండి. పాన్‌పై మూత పెట్టండి, కనీసం ఒక్క నిమిషంపాటు మూత మూసి ఉంచండి. దీనితో పన్నీర్ కాస్తంత ఆవిరి మీద ఉడుకుతుంది, అలానే మృదువుగా మారడంతోపాటుగా గ్రేవీతో మిక్స్ అవుతుంది. రుచికరమైన పాలక్ పన్నీరును వేడి రోటీలతో సర్వ్ చేయండి.

పోషకాల ఛార్ట్

క్యాలరీలు 180 గ్రాములు
మొత్తం కొవ్వు 13 గ్రాములు   
కార్బోహైడ్రేట్‌లు   25 గ్రాములు
 ప్రోటీన్‌లు 10 గ్రాములు
జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి