Header Header

కావల్సిన పదార్థాలు

  • 500 గ్రాముల జెర్సీ పన్నీరు.
  • 2 కప్పులు ఒలిచిన పచ్చి బఠాణీలు.
  • 3 పచ్చి మిరపకాయలు.
  • 2 కప్పుల తరిమిన ఉల్లిపాయలు.
  • 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం.
  • 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు (ఉల్లిపాయలతో చిదిపినవి).
  • ¼ కప్పు టొమాటో ప్యూరీ.
  • ¼ కప్పు నూనె.
  • 2 టీ స్పూన్‌ల ఆవాలు.
  • 2 బిర్యానీ ఆకులు.
  • ½ టీ స్పూన్ పసుపు పొడి.
  • ½ టేబుల్ స్పూన్ గరం మసాలా.
  • ½ టీ స్పూన్ ఎండు మిర్చి పొడి.
  • 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి .

తయారు చేసే విధానం
 

పదార్థాల కొలత 4 వ్యక్తులకు సర్వ్ చేయడానికి సరిపోతుంది.

  • ఒక పాన్‌లో నూనెను వేడి చేయండి.
  • ఆవాలు మరియు బిర్యానీ ఆకును వేయండి.
  • దీనికి ఉల్లిపాయ పేస్ట్‌ని జోడించి, ఉల్లిపాయలు బంగార వర్ణంలోని వచ్చేంత వరకు కూడా వేయించాలి.
  • దీనికి టమోటాలు, పసుపు, ఉప్పు, గరం మసాలా, ఎండు మిర్చి, ధనియాల పొడి కలిపి, నూనె విడిచేంత వరకు వేయించాలి.
  • దీనికి బఠాణీలు, తేలికగా వేపిన జెర్సీ పన్నీర్, పచ్చి మిర్చినీ కలపండి, బాగా వేగేంత వరకు బాగా ఎక్కువ వేడిమి మీద వేయించాలి.
  • రెండు కప్పుల నీటిని జోడించండి, దానిని మరగనివ్వండి, ఇలా 5 నుంచి 10 నిమిషాలపాటు సిమ్‌లో ఉంచండి.
  • వేడిగా రోటి, నాన్ లేదా అన్నంతో వడ్డించండి.

పోషకాల ఛార్ట్

క్యాలరీలు    291 గ్రాములు   
కొవ్వులు 23 గ్రాములు   
కార్బోహైడ్రేట్‌లు   4 గ్రాములు   
ప్రోటీన్‌లు 17 గ్రాములు   
జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి