Header Header

పన్నీరుని ఏవిధంగా తయారు చేస్తారు? ఇది అత్యంత సాధారణంగా అడిగే ప్రశ్న. అయితే పన్నీరు యొక్క పోషకాహార ప్రయోజనాలు ఏమిటో మీకు తెలుసా?

రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
పాల ఉత్పత్తుల్లో మరిముఖ్యంగా పన్నీరులో ఉండే కాల్షియం మరియు విటమిన్ డి, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ప్రోటీన్‌లు అధికంగా ఉండటం:
పన్నీరులో ఉండే అధిక మొత్తంలోని ప్రోటీన్‌లు, శాఖాహారులకు ఎంతో మంచిది.

ఎముకలకు బలాన్ని ఇస్తుంది:
పన్నీరులో ఉండే కాల్షియం రోజువారీ, సిఫారసు చేయబడ్డ రోజువారీ విలువలో 8% ఉంటుంది, ఇది పిల్లల్లో బలమైన ఎముకల అభివృద్ధికి మరియు పెద్దవారిలో వాటి నిర్వహణకు దోహదపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
పన్నీరులో ఫాస్ఫరస్ ఉంటుంది, పన్నీరులో ఉండే డిఎన్ఎ మరియు ఆర్ఎన్ఎ ఏర్పాటులో దోహదపడుతుంది. ఫాస్ఫేట్‌లు జీర్ణక్రియ, విసర్జనలో సహాయపడతాయి, కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసి, వాటిని వెలికి తీయడానికి సహాయపడతాయి.

గర్భవతులైన మహిళలకు అత్యుత్తమైన ఆహారం:
గర్భవతులైన మహిళలకు పన్నీరు మంచి ఆహారం వారి ఎముకల (emukala) అభివృద్ధికి దోహదపడటానికి పెద్దమొత్తంలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ అవసరం అవుతాయి.

ఆహార ప్రేమికులకు అదేవిధంగా క్రీడాకారులకు మంచి ఆహారం:
పన్నీరులో, వే ప్రోటీన్ అనే మరో ప్రోటీన్ ఉంటుంది, ఇది ఎంతో ఆరోగ్యవంతమైనది. క్రీడాకారులు మరియు ఫిట్‌నెస్ ఔత్సాహికుల్లో ఇది ఎంతో ప్రజాదరణ పొందింది. ఇది చాలా నెమ్మదిగా జీర్ణంకావడంతోపాటుగా, నెమ్మదిగా శక్తిని విడుదల చేయడం వల్ల అథ్లెటిక్స్‌, బాడీ బిల్డర్‌లు, స్ప్రింటర్‌లు మరియు వివిధ రకాల ఆటలు ఆడేవారికి ఇది ఎంతో ఇష్టమైన ప్రోటీన్.

గుండెకు ఎంతో మంచిది మరియు రక్తంలోని చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది:
పన్నీరులో ఉండే మెగ్నీషియం క్యాటలిస్టులా పనిచేస్తుంది, జీవ రసాయనిక చర్యలను ప్రోత్సహిస్తుంది, దేహంలోని వివిధ రకాల ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తుంది, కండరాలు మరియు నాడుల పనితీరు నిర్వహిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించడానికి, గుండెపోటు, మలబద్ధకం, మానసిక రుగ్మతలు, మైగ్రేన్ మరియు కొలోజెన్‌ని కూడా రాకుండా నిరోధిస్తుంది.

జీవక్రియలను మెరుగుపరుస్తుంది:
పన్నీరులో ఉండే జింక్‌ రోజువారీ సిఫారసు చేయబడ్డ విలువలో 4% ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, జీర్ణక్రియకు, మధుమేహ నియంత్రణకు, ఒత్తిడి మరియు ఆత్రుతకు విరుద్ధంగా పోరాడటానికి,అలానే రేచీకటిని నిరోధిస్తుంది, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఆకలి లేకపోవడాన్ని నిరోధిస్తుంది, అలానే ప్రొస్టేట్‌ రుగ్మతలను నిరోధించి, వివిధ రకాల అంటువ్యాధులకు విరుద్ధంగా పోరాడుతుంది.

స్ట్రోక్‌ని నిరోధిస్తుంది మరియు క్రుంగుబాటుని నియంత్రిస్తుంది:
పన్నీర్‌లో పొటాషియం కూడా ఉంటుంది, ఇది దేహంలో ద్రవ నియంత్రణ పదార్ధంగా పని చేస్తుంది, ఇది కండరాలు మరియు మెదడులో ఒక ముఖ్యమైన పదార్థం. ఇది కండరాల బెణుకుల నుంచి ఉపశమనం అందిస్తుంది. రోజువారీగా పొటాషియం తీసుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం నియంత్రించబడుతుంది. ఒత్తిడి స్థాయిల్ని మరియు క్రుంగుబాటును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

బి కాంప్లెక్స్ విటమిన్‌లను కలిగి ఉంటుంది:
మెదడు సరిగ్గా పనిచేయడానికి మరియు ఐరన్‌ని శోషించుకోవడానికి విటమిన్ బి-12 అవసరం అవుతుంది, కార్బోహైడ్రేట్‌లను శక్తిగా మార్చడానికి రిబోప్లేవిన్ సహాయపడుతుంది; పాంథోథెనిక్ ఆమ్లం సింథసైజర్ వలే పని చేసి మన దేహంలో ప్రొటీన్‌లు, కొవ్వులు, కొర్బోహైడ్రేట్‌లు మరియు అమైనో ఆమ్లాలు ఏర్పడటానికి దోహదపడుతుంది; థైమిన్ మన దేహంలోని పైరూవిక్ డీహైడ్రోజనైజ్ వ్యవస్థలో చక్కెరలు శక్తిగా మారడానికి సహాయపడుతుంది, మరో వైపు నియాసిస్ జీర్ణక్రియకు, శక్తి ఉత్పత్తి కావడం, కొలస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది; ఫోలైట్ గర్భవతులైన మహిళల్లో పిండం అభివృద్ధి చెందడానికి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి మరియు గుండెను ఆరోగ్యవంతంగా ఉంచడానికి దోహదపడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు:
సెలీనియం కణాలు మరియు డిఎన్ఎ దెబ్బతినకుండా సంరక్షించడం ద్వారా ఒక యాంటీఆక్సిడెంట్ వలే ఉపయోగపడుతుంది. సెలీనియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తగుమాత్రం తీసుకోవడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని కూడా విశ్వసించబడుతోంది. కోలన్ క్యాన్సర్‌తో నిర్ధారించబడ్డ వ్యక్తుల జీవిత కాలాన్ని పాల ఉత్పత్తులు స్వల్పంగా పెంచవచ్చని ఒక కొత్త అధ్యయనం సూచిస్తోంది.

సిఫార్సు బ్లాగులు

రోజువారీ ఆహారంలో ఎందుకు చేర్చాలో తెలుసుకోండి....
జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి