Header Header

84% భారతీయులు ప్రోటీన్ లోపానికి గురవుతున్నారని మీకు తెలుసా?.దేశంలో 84% శాఖాహారాలు ప్రోటీన్ లోపం ఉన్నవే అని,ఇది కేవలం ప్రజల్లో అవగాహన లేకపోవటంవల్లనే అని ఇండియన్ డైటిక్ అసోసియేషన్(ఐడిఏ) వారు ఇటీవల పేర్కొన్నారు

ప్రోటీన్ శరీరానికి ఏ విధంగా సహాయం చేస్తుంది? . బలమైన ఎముకల తయారీకి, కండరాలకు , మృదులాస్థికకు , చర్మానికి , రక్తానికీ కుడా ఇది చాలా అవసరం. అందుకే ప్రోటీన్ లోపం వల్ల జీవక్రియ నెమ్మదించడం, రోగనిరోధకత తగ్గడం, కీళ్ళ, కండరాల నొప్పులు, జుట్టు రాలటం, గోళ్ళ పెళుసుదనం వంటివి వస్తాయి. మానసిక కల్లోలం , శక్తి తగ్గడం , అలసట, పిల్లల్లో కుంటుపడిన ఎదుగుదల , మూత్రపిండాలు సరిగా పని చేయకపోవుట, రక్తహీనత వంటివి కూడా ప్రోటీన్ లోపం వల్ల వచ్చే మరికొన్ని లక్షణాలు.

ప్రోటీన్ లోపం శాఖాహారుల్లో అధికంగా కనిపించినప్పటికీ, తీసుకునే ఆహారంలో సరైన మోతాదు ప్ర్రోటిన్ చేర్చుకోకపోవటం వల్ల మాంసాహారులు కూడా దీని బారిన పడే అవకాశం ఉంది. రోజుకు గరిష్టంగా, మన శరీరానికి ఎంత ప్రోటీన్ అవసరమో 93% భారత జనాభాకు అవగాహన లేదని గణనాంకాల్లో వెల్లడైంది.

ప్రోటీన్ వినియోగానికి సంబంధించిన అపోహల నుండి జాగ్రతగా ఉండటం అవసరం:

• బాడీ బిల్డర్లకు మాత్రమే ప్రోటీన్ అవసరం
•  బరువు తగ్గాలంటే ప్రోటీన్ శాతం తగ్గించాలి
•  అధిక ప్రోటీన్ వల్ల కిడ్నీ వ్యాధులు వస్తాయి
•  ప్రోటీన్ మందుల ద్వారానే వస్తుంది
•  ప్రోటీన్ వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి
•  పాల ఉత్పత్తులు తొలగించడం వల్ల కొవ్వు తగ్గుతుంది

జీవనశైలి , శారీరిక శ్రమతో సంబంధం లేకుండా, ఒక కిలో శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ మన శరీరానికి అవసరం. భారతీయుల ఆహారం ఎక్కువగా బియ్యం , గోధుమలతో కూడినది కాబట్టి, శాఖాహారులు ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాలను తింటూ, వారి డైట్ సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. మనం రోజు మొత్తంలో తినే ప్రధానమైన ఆహారంలో 25% ప్రోటీన్ ఉండాలని చెప్పబడింది.

రోజువారి ఆహారంలో ప్రోటీన్ చేర్చుకోవడానికి, శాఖాహార మూలాలతో కూడిన కొన్ని సలహాలు:

• అల్పాహారానికి ఒక గ్లాసు పాలు జోడించుకుంటే, నాణ్యమైన ప్రోటీన్లతోపాటు రుచిగా కూడా ఉంటుంది.
• పెరుగు, పనీర్ కూడా అధికమైన ప్రోటీన్ పదార్ధాలే.
• రోజువారీ ఆహారంలో పనీర్ వాడటం వల్ల రోజుకు కావాల్సిన కనిష్ట ప్రోటీన్ మోతాదును నిర్వహించుకోవచ్చు. క్రింది లింక్- https://www.godrejjersey.com/te/community లో 'రెసిపీ బుక్' పై క్లిక్ చేసి మా పనీర్ వంటకాలను ఆనందించి స్ఫూర్తి పొందండి.
•  ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ 8 గ్రాముల ప్రోటీన్ ను ఇస్తాయి. కాబట్టి వీటిని అల్పాహారంలో తీసుకుంటే రోజుకు గొప్ప ఆరంభాన్ని ఇస్తాయి.
• రోజూ తినే ఆహారంలో తృణధాన్యాలు, చిరుధాన్యాలు తీసుకుంటూ, అందులోని ప్రోటీన్ శాతం మనకి అనుకూలంగా ఉండేటట్టు చూసుకోవాలి.
• పప్పులు, పచ్చి బఠానీలు, సోయా, మొలకలు, రాజ్మా మాత్రమే కాకుండా వేయ్ పౌడర్ కూడా మంచి ప్రోటీన్ మూలకమే.

సిఫార్సు బ్లాగులు

జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి