Header Header

అటు శాకాహారులు, మాంసాహారులు కూడా పాలను మాంసకృత్తుల వనరుగా భావిస్తారు, కానీ పాల గురించి చాలా అపోహలు ఉన్నాయి. పాల గురించిన చాలా అపోహలు చక్కర్లు కొడుతున్నాయి.

à°—à°¡à°šà°¿à°¨ కొన్ని దశాబ్దాలుగా, భారతీయ వృత్తి వ్యాపారాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. దేశంలోని సామాజిక –ఆర్ధిక మార్పులతో పాటే ఆహారపు అలవాట్లు, నమ్మకాలలో కూడా మార్పు వచ్చింది. దీనికి తోడు, భారతీయ భోజనంలో పిండి పదార్ధాలు ఎక్కువగా ఉండడం, దాంతో పాటు నిత్యావసరమైన మాంసకృత్తుల కోసం శాకాహారం మీద ఆధారపడడం కూడా కలిసి వచ్చింది. ఇలాంటి వాటితో పాటు ఇతర కారణాల వల్ల కూడా భారతీయుల్లో చాలా మంది ప్రోటీన్ల కొరతతో వచ్చిన అనారోగ్యాలతో బాధపడుతున్నారు.

గోద్రెజ్ జేర్సీ తరఫున కార్వీ ఇన్సైట్స్ నిర్వహించిన “దక్షిణ భారత ప్రోటీన్ల కొరత 2019” అధ్యయనం తేల్చింది ఏమిటంటే – 80 శాతం మంది వినియోగదారులకు ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న ఆహారం వల్ల ప్రయోజనాల గురించి తెలిసినప్పటికీ – చాలా మందికి రోజుకు మనిషికి à°Žà°‚à°¤ మొత్తంలో ప్రోటీన్లు అవసరమో తెలియదు. డానికి తోడు, పాల వల్ల బరువు పెరుగుతామని, అందువల్ల దాన్ని నిత్యం అవసరమయ్యే ప్రోటీన్ల వనరుగా భావించడం లేదని 48 శాతం మంది తెలిపారు. నవంబర్ 26à°µ తేదీన మనం జాతీయ పాల దినోత్సవం జరుపుకోబోతున్నాం కనుక, స్వతస్సిద్ధంగా, పుష్కలంగా ప్రోటీన్లు అందించే పాల వల్ల ప్రయోజనాలను మరో సారి సమీక్షి౦చుకోవాల్సిన అవసరం ఉంది.

అపోహలను దూరం చేయడం

పాల వినియోగం గురించి చాలా అపోహలు ఉన్నాయి. పాలల్లో చాలా కొవ్వు శాతం ఉంటుందని, అందువల్ల బరువు పెరుగుతామని భావించి చాలా మంది పెద్ద వాళ్ళు కూడా పాలు వినియోగించడానికి సంశయిస్తారు. కానీ దీన్ని సరైన దృక్కోణంలో చూడాల్సి వుంది.

పచ్చి పాలలో సుమారుగా మూడు నుంచి నాలుగు శాతం కొవ్వు ఉన్నప్పటికీ, వెన్న తీసిన పాలలో చాలా తక్కువ ఉంటుంది. సగటున 100 మిల్లీ లీటర్ల పాలు సుమారు మూడు గ్రాముల ప్రోటీన్ అందిస్తాయి, ఇవి శరీరంలో తేలిగ్గా ఇమిడిపోతాయి. సరైన మోతాదులో తీసుకుంటే, టోన్డ్ పాలు, పాల ఆధారిత పానేయాలు లేదా పెరుగు, పనీర్ à°² వంటి డైరీ ఉత్పత్తుల నుంచి కూడా రోజువారి ప్రోటీన్ అవసరాలు తీరుతాయి. లాక్టోస్ సరిపడని వాళ్ళు కూడా పెరుగు తీసుకోవచ్చు. పాలు తీసుకోవడం వల్ల శరీరానికి అందే ప్రోటీన్ల మోతాదు – అందులోని కొవ్వు శాతం వల్ల కలిగే దుష్ప్రభావాలను దూరం చేస్తుంది.

శాకాహారులు కూడా రోజూ 400  నుంచి 50౦ మిల్లీలీటర్ల పాలతో పాటు సరైన మోతాదులో పప్పు దినుసులు, ధాన్యాలు తీసుకుంటే వారికి రోజువారి అవసరమయ్యే ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. మాంసాహారులు అయితే తమ ఆహరంలో గుడ్లు, చికెన్, ఫిష్ లాంటి పదార్ధాల నుంచి వచ్చే ప్రోటీన్లు అందుకోవచ్చు.

వయసుతో పాటు శరీరంలో పాలను అరిగించుకునే సామర్ధ్యం కల ఎంజైమ్ లు తగ్గిపోతూ ఉంటాయనేది మరో అపోహ. పాలు పిల్లలకు మాత్రమె మంచిదనే అభిప్రాయం నుంచి ఉత్పన్నమైనదే ఈ వాదన, కానీ అదీ తప్పే. పాలు పెద్ద వారికి కూడా ప్రయోజనం కలిగిస్తాయి.

తెల్లటి నిజాలు

సగటు మనిషికి తన శరీరంలోని ప్రతి కిలో బరువుకు ఒక్క గ్రాము చొప్పునా రోజువారీగా ప్రోటీన్లు అవసరం అవుతాయి. ఉదాహరణకు, ఓ పురుషుడు 60 కిలోల బరువుంటే అతను నిత్యం 60 గ్రాముల ప్రోటీన్ కూడా తీసుకోవాలి. అంతకన్నా తక్కువ తీసుకుంటే అది అలసటకు, కండరాల క్షీణత కు దారి తీయవచ్చు, దీని వల్ల శరీరం స్థిరత్వం, కదలిక కూడా ప్రభావితం అవుతాయి. బాగా కొరత ఎక్కువగా ఉంటె అది ప్రాణాంతకం అవుతుంది.

మరో వైపు, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న భోజనం మనిషిలో రోగనిరోధక శక్తికి దోహదపడుతుంది, అలాగే రోజంతా శక్తి కలిగి వుండడం వల్ల మానసిక ఉత్సాహం కూడా ఉంటుంది. దురదృష్టవశాత్తూ, భారత జనాభాలో చాలా మందికి ప్రోటీన్లు పుష్కలంగా ఉండే భోజనం వల్ల వచ్చే ప్రయోజనాలు అందడం లేదు.

ఈ కొరతను తీర్చడం

అయితే, కేవలం ప్రోటీన్లు తీసుకోవడం ఒక్కటే సరిపోదు. చాలా మంది భారతీయులు కూరగాయల నుంచి ప్రధానంగా ప్రోటీన్లు అందుకుంటున్నా వారి భోజనాలలో ప్రోటీన్ల కొరత ఉంటోందని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ఈ విధంగా, నాణ్యత కల ప్రోటీన్లు చాల ముఖ్యం, ప్రత్యేకంగా మానవ శరీరానికి తొమ్మిది ముఖ్యమైన అమినో యాసిడ్లు అందించేది.

ఇక్కడే పాలు ఒక కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలోని ఎముకలు, పళ్ళను బలపరిచే కాల్షియంను అందించడంతో పాటు పాలల్లో ప్రోటీన్లు కూడా విరివిగా ఉంటాయి. అదీ ఇందులో అవి స్వతస్సిద్ధంగా ఉండడం వల్ల అది ఈ కొరతను తేలిగ్గా తీర్చగలదు.

పాలపుంత

ఆరోగ్యకరమైన జీవితానికి సమతుల ఆహారం చాల ముఖ్యం, దాంట్లో ప్రోటీన్లు కీలక పాత్ర పోషిస్తాయి. అందుబాటు ధరలో ఉండి స్వతస్సిద్ధ ప్రోటీన్ వనరు అయిన పాలు, భారతీయ సగటు మనిషికి ఎదురయ్యే ప్రోటీన్ల కొరతను తీర్చగలదు. తినడానికి, తాగడానికి తెగ విసిగించే మనిషికి కూడా నచ్చేలా పాలను ఎన్నో రకాలుగా వినియోగించవచ్చు. ఉదయాన్నే గ్లాసు పాలు, మధ్యాహ్న భోజనంలో ఓ పనీర్ వంటకం, చివరిగా రాత్రి భోజనంలో పెరుగు తీసుకుంటే ప్రతి వారికి ప్రోటీన్ల వినియోగం పెరుగుతుంది.

రచయిత – డాక్టర్ ధరిణి కృష్ణన్ సైన్స్ లో డాక్టరేట్ చేసిన రిజిస్టర్డ్ డైటీషియన్- ప్రస్తుతం కన్సల్టెంట్ డైటీషియన్ à°—à°¾ ప్రాక్టీస్ చేస్తున్నారు.

 

సిఫార్సు బ్లాగులు

జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి