ఉత్పత్తులు
-
పాలు
-
పెరుగు
-
పాలు పానీయాలు
-
స్వీట్లు
-
పన్నీర్
-
నెయ్యి
-
ఐస్క్రీమ్
ఉత్పత్తులు
-
పాలు
-
పెరుగు
-
పాలు పానీయాలు
-
స్వీట్లు
-
పన్నీర్
-
నెయ్యి
-
ఐస్క్రీమ్
వంటకాల
పన్నీర్ పరాటా
కావల్సిన పదార్థాలు
పదార్థాల కొలత 4 వ్యక్తులకు సర్వ్ చేయడానికి సరిపోతుంది
ఆట్టా లేదా గోధుమ పిండి కలపడానికి:
- 2 కప్పుల గోధుమ పిండి.
- రుచికి తగ్గట్టుగా ఉప్పు, 1 టీస్పూన్ ఆయిల్ లేదా నెయ్యి.
పన్నీర్ స్టఫింగ్ కొరకు:
- 200 గ్రాముల జెర్సీ పన్నీరు తురిమినది.
- 2 పచ్చి మిరపకాయలు, సన్నగా తరిగినవి.
- ½ టీ స్పూన్ ఎండు మిర్చి పొడి.
- ఒక చిన్న సైజు ఉల్లిపాయ బాగా తరిగినది (ఆప్షనల్).
- ½ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్.
- ¼ టీస్పూన్ చక్కెర.
- ఆంచూర్ పొడి (పొడి మామిడి పొడి) రుచికి.
- రుచికి ఉప్పు.
- పరాటా తయారు చేయడానికి జెర్సీ నెయ్యి లేదా ఆయిల్.
తయారు చేసే విధానం
పిండి ముద్ద తయారీ విధానం:
- ఒక మిక్సింగ్ పాత్రలో, గోధుమ పిండి, ఉప్పు మరియు ఆయిల్ తీసుకోండి. వాటిని బాగా కలిపి, నెమ్మదిగా నీటిని కలపడం ప్రారంభించండి.
- దానిపై నీటిని నెమ్మదిగా చల్లుతూ ఉండండి, సుమారు 5-7 నిమిషాలపాటు పిండిని పిసకండి. చపాతీ/రోటీకి కలిపినట్లుగా పిండిని కలపాలి.
- దానిపై తేమగా ఉండే బట్టను ఉంచి, 20 నిమిషాలపాటు పక్కన పెట్టండి.
స్టఫింగ్ తయారు చేయడానికి:
- స్టఫింగ్ చేయడం కొరకు అన్ని పదార్థాలను కలపండి.
పన్నీర్ పరాటా తయారు చేయడానికి:
- పిండిని ఎనిమిది సమానమైన ముద్దలుగా చేయండి.
- పిండి ముద్దతో పలుచగా ఉండే చపాతీలు చేయండి ( సుమారు 4 నుంచి 5 అడుగుల వ్యాసం ఉండాలి).
- చపాతీ పిండిపైన అంచులు విడిచిపెట్టి, సఫ్టింగ్ పరవండి.
- ఈ పిండిపై మరో చపాతీతో కవర్ చేయండి. అంచులు తెరుచుకోకుండా బాగా ఒత్తండి.
- ఇప్పుడు, అతుక్కోకుండా ఉండటం కొరకు కాస్తంత పిండిని తడిమి, దాని రోటీ వలే రోల్ చేయండి.
పరాటా వండటం:
- తవాని బాగా వేడి చేయండి. రోల్ చేసిన పరాటాని దానిపై ఉంచండి.
- ఒక మాదిరిగా కాలిన తరువాత మరోవైపుకు తిప్పి వేయండి. దానిపై నెయ్యి లేదా ఆయిల్ వేయండి.
- మళ్లీ తిప్పి, మరోవైపున కూడా నెయ్యి వేయండి.
- ఈ విధంగా తిప్పేటప్పుడు, పరాటాపై మీరు బంగారు వర్ణంలోని మచ్చల్ని చూడవచ్చు, ఇది బాగా ఉడికినట్లుగా తెలియజేస్తుంది.
- దీనిని మంటపై నుంచి తీయండి. మీ పరాటా నెయ్యిలో పూర్తిగా కాలినప్పటికీ, మరింత రుచి కొరకు, దాని మధ్యలో చిన్న వెన్న ముక్కను ఉంచి, దానిని కరగనివ్వండి.
- పెరుగు, పచ్చడి లేదా రైతాతో వేడిగా సర్వ్ చేయండి. గ్రీన్ చట్నీతో దీనిని మీరు ఎంతో ఇష్టపడతారు.
పోషకాల ఛార్ట్
క్యాలరీలు | 236 - 250 గ్రాములు |
కొవ్వులు | 16 గ్రాములు |
కార్బోహైడ్రేట్‌లు | 22 గ్రాములు |
ప్రోటీన్‌లు | 6-8 గ్రాములు |
సిఫార్సు వంటకాలు
ఎలాంటి సందర్భానికైనా సరైనది, మిల్క్షేక్ ఖచ్చితంగా అందరి మది దోచుకుంటుంది!
పూజ మిశ్రా చే, #HomeBakerMatters రెసిపీ ఛాలెంజ్
తప్పక తినాలనిపించే కోరిక కలిగించే కోవకు చెందిన తేలికపాటి విలాసవంతమైన స్ప్రింగ్ రోల్స్ డెసెర్ట్. ఈ రోజే ఇంట్లో తయారు చేసే ప్రయత్నం చెయ్యండి
జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి