ప్రోటీన్ అనేది కండరం, ఎముక, చర్మం, జుట్టులో కనబడుతుంది. వాస్తవానికి శరీరం యొక్క ప్రతి భాగంలో మరియు కణజాలంలో ఉంటుంది. అది పలు రసాయన ప్రతిచర్యలు ప్రారంభించగల శక్తి గల ఎంజైమ్‌లు మరియు మీ శరీరవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరా చేసే హెమోగ్లోబిన్‌తో రూపొందించబడుతుంది. మీ శరీరం ఆరోగ్యంగా ధృడంగా ఉండటానికి దాదాపు 10,000 విభిన్న రకాల ప్రోటీన్‌లు అవసరం.
కొవ్వు కార్బోహైడ్రేట్‌లతోపాటు, ప్రోటీన్ కూడా "స్థూల పోషక పదార్థం", అంటే శరీరానికి ఇది ఎక్కువ మొత్తంలో అవసరం. ప్రోటీన్‌ను శక్తిని నిల్వ ఉంచే రెండవ అతిపెద్ద వనరుగా కూడా చెబుతారు ఎందుకంటే ఇది అధిక మొత్తంలో కండరాలకు స్థిరంగా ఎమైనో ఆమ్లాలను అందించే వనరు.
పాల నుండి సంగ్రహించబడిన ప్రోటీన్‌ను సంపూర్ణ ప్రోటీన్‌గా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది తొమ్మిది రకాల ముఖ్యమైన ఎమైనో ఆమ్లాలను అందించే వనరు.
"పప్పుదినుసులు, కాయధాన్యాల నుండి లభించే ప్రోటీన్‌ను అసంపూర్ణంగా పరిగణిస్తారు ఎందుకంటే వీటిలో అత్యవసర ఎమైనో ఆమ్లాలు ఉండవు. పాల ఉత్పత్తులు ఉపయోగించని వ్యక్తులకు ఇది సమస్యగా చెప్పవచ్చు."
పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి ప్రోటీన్ అత్యవసరం. ఇది కండరాల నిర్మాణం ఎదుగుదలలో సహాయడుతుంది, కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు, మంచి చూపుకు దోహదపడుతుంది మరియు రోగ నిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పని చేయడానికి కూడా సహాయపడుతుంది. అధ్యయనాల్లో ప్రోటీన్ వలన జీవక్రియలో తాత్కాలిక చురుకుదనం, ఆకలి మందగించడం రెండూ సాధ్యమవుతాయని తెలిసింది. ప్రోటీన్ పదార్థాలను వయోజనులు కూడా తప్పక ఉపయోగించాలి ఎందుకంటే దీని వలన శరీర మరమ్మతు నిర్వహణ సాధ్యమవుతుంది. ప్రోటీన్‌లు మీ శరీరంలో పాడైన భాగాల మరమ్మతులో సహాయపడతాయి రోజువారీ పనుల వలన సంభవించే కష్టనష్టాల ప్రభావాలను తగ్గిస్తాయి.
పాలులో రెండు రకాల ప్రోటీన్‌లు ఉంటాయి: వే (20%) , కేసీన్ (80%) రెండూ అత్యధిక నాణ్యతా ప్రోటీన్‌లు మరియు రెండింటిలోనూ శరీరంలో ప్రోటీన్ యొక్క పలు విధులకు మద్దతుగా తగిన మోతాదులో మొత్తం అత్యవసర ఎమైనో ఆమ్లాలు ఉంటాయి.
80% మంది భారతీయులు ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారని, సర్వేలో తేలింది. ఇటీవల 'వయోజన భారతీయుల డైట్‌లో ప్రోటీన్ వాడకం సర్వేలో : సాధారణ వినియోగదారు సర్వే (PRODIGY)'లో భారతదేశంలో ప్రోటీన్ వాడకానికి సంబంధించి ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి. డైలీ డైటరీ అలవెన్సు (రోజువారీ పథ్యసంబంధిత భత్యం) (DDA) ఒక కిలోగ్రాము శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ లేదా పౌండ్‌కు 0.36 గ్రాములు. ఈ మొత్తాలు: సగటు కదలని పురుషుడుకు రోజుకు 56 గ్రాములు, సగటు కదలని మహిళకు రోజుకు 46 గ్రాములు. ఒక కప్ పాలులో సుమారు 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, ఇది DDAలో 16% మరియు ఇది రోజూ ప్రోటీన్ వాడకానికి సహాయపడుతుంది. రోజంతా పలు రకాల ప్రోటీన్ వనరులను ఉపయోగించినంత కాలం, మీ శరీరం ప్రతి భోజనం నుండి అవసరమైనంత ప్రోటీన్‌ను సంగ్రహిస్తుంది.
పాలు, పెరుగు మరియు పన్నీరు వంటి పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉండటమే కాకుండా వాటిలో ఓస్టియోపోరోసిస్ (బోలు ఎముకల వ్యాధితో) తో సమర్థవంతంగా పోరాడే విలువైన కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది.