Header Header

పాలలో ఉండే పోషకాల వల్ల పాలు పౌష్టికాహారంగా గుర్తించబడ్డాయి. పాలు అత్యంత నాణ్యమైన ప్రోటీన్‌లను అందిస్తుంది, దీనిలోని విటమిన్ డి, మన దేహం కాల్షియంని శోషించుకునేందుకు సహాయపడుతుంది. ఎముకలు ఏర్పడటానికి, వాటిని బలంగా ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ డి సహాయపడుతుంది. అందువల్ల, మీ పాలలో విటమిన్ డి లోపించినట్లయితే, మీరు ప్రతిరోజూ తాగే పాలు వ్యర్ధంతో సమానం.

మన చర్మంపై సూర్యకాంతి పడినప్పుడు మన శరీరానికి విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. సాల్మన్, ట్యూనా, పుట్టగొడుగు, మరియు పాశ్చ్యురైజ్డ్ గుడ్లు వంటివవాటిలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది.

భారతదేశం ఉష్ణమండల దేశం కావడం వల్ల, రోజువారీగా అవసరమైన అయ్యే ఈ విటమిన్‌ని సూర్యకాంతి ద్వారా పొందవచ్చు. జీవనశైలి, పని సంస్కృతి మారడం, స్కూలు స్కూల్ వేళలు ఇవన్నీ కూడా విటమిన్ డి లోపానికి దారితీస్తాయి, ఎక్కువ గంటలు పనిచేయడం లేదా నైట్ షిఫ్ట్‌ల వల్ల వ్యక్తులు అవసరమైనంత మేరకు సూర్యకాంతిని పొందలేకపోతారు. సన్ స్క్రీన్ లేదా సన్ బ్లాకర్‌లు ఉపయోగించడం వల్ల కూడా ప్రత్యక్ష సూర్యకాంతి ప్రభావాలను పొందలేకపోతున్నారు.

ఆహారంలో లభించని పోషకాలను చేర్చడం ద్వారా, వాటి పోషకాహార నాణ్యతను పెంచే స్థాయికి సాంకేతికత అభివృద్ధి చెందింది. విటమిన్ డి జతచేయబడ్డ పాలను కేవలం 2 గ్లాసులు తీసుకోవడం ద్వారా బలమైన ఎముకలు మరియు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే తగిన విటమిన్ డి మొత్తాన్ని మీరు పొందవచ్చు.

విటమిన్ డితో నిండిన పాల తాగడం ద్వారా మీరు పాలులోని అన్ని సుగుణాలను పొందుతారు, ఇది మీ శరీరానికి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ డి ఈ దిగువ పేర్కొన్నశరీర విధులకు సహాయపడుతుంది:

           • అంటువ్యాధులకు విరుద్ధంగా పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థ
           • కండరాల పనితీరు
           • ఆరోగ్యవంతమైన గుండె మరియు ప్రసరణ కొరకు గుండె పనితీరు
           • ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తులు మరియు వాయునాళాల కొరకు శ్వాస వ్యవస్థ పనితీరు
           • మెదడు అభివృద్ధి
           • క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాలు

నేడే ఆరోగ్యానికి చీర్స్ చెప్పండి!

సిఫార్సు బ్లాగులు

వేసవి కోసం సులభమైన రీఫ్రెషింగ్ పానీయాలు
శాఖాహారులకు గొప్ప ప్రోటీన్ వనరులు అందిస్తుంది, వంట చేయడం ఎందుకో తెలుసుకోండి..
జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి